Sunday, March 22, 2026
Home » శ్రీవాణి ట్రస్టు పై శ్వేత పత్రం విడుదల చేసిన టీటీడీ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

శ్రీవాణి ట్రస్టు పై శ్వేత పత్రం విడుదల చేసిన టీటీడీ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



తిరుమల: మే 31 ,2023 వరకు శ్రీవాణి ట్రస్టుకు 861 కోట్లు నిధులు వచ్చాయి. వివిధ బ్యాంకుల్లో 602.60 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. ఎస్.బి ఖాతా క్రింద రోజూవారి వచ్చే డబ్బు 139 కోట్లు వివిధ బ్యాంకుల్లో ఉంది. డిపాజిట్లు పై వడ్డీ రూపంలో 36.50 కోట్లు వచ్చింది. దేవాలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి ఇప్పటిదాకా 120.24 కోట్లు ఖర్చు చేశాం. రాజకీయ లబ్ధి కోసం శ్రీవాణి ట్రస్ట్ పై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేశారు. శ్రీవాణి ట్రస్ట్‌పై ఆరోపణలు చేసినవారిపై న్యాయసలహా తీసుకొని కచ్చితంగా కేసులు పెడతాం.

టిటిడిలో ఎంతటి వాడైన అవినీతి చేయడానికి భయపడాల్సిందే…తప్పు చేస్తే శిక్ష తప్పదు అది నేనైనా సరే. ఏపీతో సహా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 127 ప్రాచీన ఆలయాల పునరుద్ధరణకు 139 కోట్లు కేటాయించాము. భజన మందిరాలు, ఎస్సీ, ట్రైబల్ ప్రాంతాలలో 2,273 ఆలయాల నిర్మాణం పూనుకున్నాము. ఇందు కోసం 227 కోట్ల 30 లక్షల కేటాయింపులు జరిగాయి. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై ఎటువంటి అనుమానాలు ఉన్నా నేరుగా టీటీడీని సంప్రదించవచ్చు.

టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch