Sunday, March 22, 2026
Home » అభిమాన నేతకు అశ్రునివాళి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

అభిమాన నేతకు అశ్రునివాళి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment


  • జర్నలిస్టు ఉద్యమ నేత అంబటి ఆంజనేయులుకు నివాళులర్పించిన ప్రముఖులు
  • అధిక సంఖ్యలో తరలివచ్చిన ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నాయకులు, కార్యకర్తలు

విజయవాడ: జర్నలిస్టు ఉద్యమ నేత అంబటి ఆంజనేయులకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి కడసారి దర్శించుకుని శ్రద్ధాంజలి ఘటించారు. విజయవాడలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు, ఏపీయూడబ్ల్యూజే సలహాదారు అంబటి ఆంజనేయులుతో వారి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయ పార్టీలు నేతలు, జర్నలిస్టు సంఘాల నాయకులు నివాళులర్పించారు. సోమవారం దుర్గాపురంలోని అంబటి ఆంజనేయులు నివాసానికి చెందిన నేతలు వచ్చి అబంటి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం వరకు ఇంటి దగ్గరే బంధువులు, సన్నిహితుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచారు. అనంతరం గాంధీ నగర్‌లోని విజయవాడ ప్రెస్‌ క్లబ్‌కు భౌతికకాయాన్ని తీసుకువచ్చారు. జర్నలిస్టు యూనియన్ నాయకులు, జర్నలిస్టులు, నగర ప్రముఖులు, రాజకీయ నాయకులు సందర్శించి అభిమాన నేతకు అశ్రునివాళులర్పించారు. జర్నలిస్టుల అశ్రునయనాలతో అంబటి ఆంజనేయులు అంతిమ యాత్రలో కొనసాగుతారు. కృష్ణలంకలోని స్వర్గపురిలో అంబటి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

నివాళులర్పించిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఏఐకేఎస్‌ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్‌, రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు సభ్యులు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు, టీడీపీ పొలిట్‌రావు , సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సీహెచ్‌.బాబూరావు, వై.వెంకటేశ్వరరావు, దోనేపూడి కాశీనాథ్‌, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు. విశాలాంధ్ర ఎగ్జిక్యూటీవ్‌ ఎడిటర్‌ కూన అజయ్‌బాబు, న్యూస్‌ ఎడిటర్‌ మోదుమూడి మురళీకృష్ణ ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శులు డి.సోమసుందర్‌, వై నరేందర్‌ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేశ్‌కుమార్‌, కె.సత్యనారాయణ, తెలంగాణ ఎస్పీ కృష్ణారెడ్డి, నాయకులు దాసరి కృష్ణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు నగునూరి శేఖర్, విరాహత్‌ అలీ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్‌, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్‌ యూనిట్‌ అధ్యక్షులు చావా రవి, ప్రధాన కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర సమాచార అధ్యక్షులు ఎస్‌.వెంకట్రావ్‌, సలహా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు చెవులపల్లి కృష్ణాంజనేయులు, పౌరసంబంధాల శాఖ కమీషనర్‌ విజయకుమార్‌రెడ్డి, అసిస్టెంట్‌ కమీషనర్‌ కస్తూరి, అధికార సంఘం చైర్మన్‌ పి.విజయబాబు, సీఆర్‌ మీడియా అకాడమి కార్యదర్శి తిలక్‌, ఆంధ్రప్రదేశ్‌ మీడియా ప్రొఫిషనల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్‌ యాదవ్‌, కార్యదర్శి వై.వి.రమణ సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి రమణరెడ్డి ఉన్నారు. . సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అంబటి ఆంజనేయులు మృతికి సీపీఐ జాతీయ విలువకార్యదర్శి కె.నారాయణ సోమవారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch