
- మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
ముద్ర.వీపనగండ్ల:-చిన్నంబావి మండల పరిధిలోని లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొడ్డు శ్రీధర్ రెడ్డి హత్య జరిగిన సంఘటన హర్ష కొల్లాపూర్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే బీరం వర్ధన్ రెడ్డి పరిశీలించారు. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి హత్య ముమ్మాటికి రాజకీయ హత్య అని అన్నారు. శ్రీధర్ రెడ్డి మండలంలో మంచి పేరుపొందిన వ్యక్తి ఏలాంటి ఇతర కారణాల వల్ల లేవనీ,తన రాజకీయ ఎదుగుదల గిట్టని కొందరు వ్యక్తులు రాష్ట్ర కేబినెట్ మంత్రి ప్రోద్బలంతోనే హత్య చేశారు,శ్రీధర్ రెడ్డి హత్యపై సిబిఐ విచారణ చేపట్టిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుని బర్తప్ చేయడం జరిగింది,ఎన్నికలు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని వాటిని కట్టడి చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. . ఇటీవల రాష్ట్ర డిజిపిని కలిసి నియోజకవర్గంలో జరిగే సంఘటనలను వివరించామని అంతలోనే శ్రీధర్ రెడ్డి హత్య చేయటం చాల భాదకరమని అన్నారు.