Sunday, March 15, 2026
Home » పత్తి విత్తనాల వేటలో రైతన్నలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

పత్తి విత్తనాల వేటలో రైతన్నలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 పత్తి విత్తనాల వేటలో రైతన్నలు - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దుక్కులు దున్ని పత్తి విత్తనాలు విత్తడానికి సిద్ధమవుతున్న రైతన్న
  • ఖరీఫ్ సీజన్ ప్రారంభ సమయం ఆసన్నం కావడంతో విత్తనాల కోసం రైతన్నల ఎదురుచూపు
  • కొన్ని రకాల పత్తి విత్తనాలు దుకాణాల్లో రాలేదంటున్న దుకాణదారులు
  • పత్తి విత్తి సీజన్ సమీపంలోని రైతులు కోరుకున్న విత్తనాలు సరఫరా చేయాలనుకుంటున్న రైతులు
  • విత్తనాల సరఫరా కోసం వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు
  • ఇప్పటికే దుకాణాల్లో పత్తి విత్తనాలు వచ్చాయా? రైతులకు వస్తే నేరుగా అమ్మకం చేస్తారా? లేదా?
  • అనుమానం వ్యక్తం చేస్తున్న రైతులు?
  • విత్తన విక్రయ విక్రయాల ముందు విత్తన వివరాలను సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలి

తుంగతుర్తి ముద్ర:- తుంగతు నియోజకవర్గంలో వేలాది ఎకరాల పత్తి సాగు దశాబ్దాల కాలంగా రైతులు సాగు చేస్తున్నారు. తాము కోరుకున్న రకం పత్తి విత్తనాలు దుకాణాల్లో ఉండకపోవడం వారిచ్చే పత్తి విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయవలసి ఉంటుంది .మేలు రకాల విత్తనాలు వచ్చాయని లేదా ఆ రకం పత్తి విత్తనాలు కావాలంటే మరో రకం విత్తనాలు వాటితో పాటు కొనాలని కొనుగోలుదారులు గతంలో కొనుగోలు చేసిన దుకాణదారులు వారిని అప్పుడప్పుడు కట్టడి చేయడం ప్రారంభించారు . అయినా ప్రతి ఏడాది కొన్ని రకాల విత్తనాలను బ్లాక్ చేయడం పరిపాటిగా మారింది.

ఈ సంవత్సరమైనా పత్తి విత్తనాలు సకాలంలో రైతన్నలకు అందించే సంబంధిత శాఖ చర్యలు కొనసాగుతున్నాయని రైతులు అంటున్నారు .నాణ్యమైన విత్తనాలు శార్టేజీ లేకుండా దుకాణదారులను కట్టడి చేయాలని రైతులు కోరుతున్నారు విత్తన దుకాణంలో లభించే పత్తి విత్తన రకాలు స్టాక్ ఎంత ఉందో సూచించే బోర్డులను విధిగా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను పలువురు రైతులు కోరుతున్నారు .ఇప్పటికే పత్తి విత్తనాలు దుకాణాల్లోకి వచ్చాయా? లేదా ?వస్తే వాటి వివరాలు వ్యవసాయ శాఖ అధికారులకు లేదా దుకాణదారులు తెలిపారా ?అనే విషయాలు ఇంకా తెలియడం లేదు. పత్తి విత్తనాలు ఏ రకాలు వచ్చాయో ముందుగానే రైతులకు తెలిసేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నాసిరకం విత్తనాలు అమ్మకాలను అరికట్టి నాణ్యమైన విత్తనాలు దుకాణదారులు అమ్మకం చేసేలా అనేక చర్యలు రైతులను కోరుతున్నారు .ఇప్పటికే వ్యవసాయ రంగంలో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న రైతాంగం తెల్లబంగారంగా పిలవబడే పత్తి పంట నష్టపోకుండా అటు అధికారులను ఇటు విత్తన విక్రయదారులను యావత్ రైతాంగం కోరుతుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch