తెలుగు అసోసియేషన్- యూఈ కార్యనిర్వాహక సభ్యులు దుబాయ్‌లోని ఇండియన్ క్లబ్ నందు తానా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు గారితో ఆత్మీయ సమ్మేళనం జరిగింది.అంజయ్య చౌదరి లావు గారు గత ఒకటిన్నర దశాబ్ద కాలంలో తానాలో వివిధ పదవులలో బాధ్యతలు నిర్వర్తించారు, వారి అకుంఠిత సేవా తత్పరత , దర్శనికత తానాలో అత్యంత ప్రతిష్టాకరమైన ఎమర్జెన్సీ సర్వీస్ టీం ఐన తానా టీం స్క్వేర్ నుండి అత్యంత కీలకమైన పదవి ఐన అధ్యక్ష పదవి వరకు సేవలందించే అవకాశం దక్కించుకున్నారు. వీరి నాయకత్వంలో తానా కేర్స్ మరియు తానా టీం స్క్వేర్ ద్వారా వందల కొలది విపత్కర పరిస్థితులలో ఉత్తర అమెరికాలోని తెలుగు వారికి సహాయ సహకారాలు అందించారు.

అంజయ్య చౌదరి లావు గారు తానా సంస్థ గత నాలుగు దశాబ్దాలుగా అమెరికాలోని తెలుగు వారికి అందించే సేవా కార్యక్రమాల గురించి వివరించారు. తానా సుదీర్ఘ కాలం సేవలందించడానికి ప్రధాన కారణమైన సంస్థాగత నిర్మాణం , వివిధ విభాగాల రూపకల్పన , కార్యక్రమాల నిర్వహణ విధానాలు , బోర్డు మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీల పరస్పర సహకారములు , నిధుల సేకరణ వంటి అనేక కార్యక్రమాలను విస్తృతంగా వివరించారు . తెలుగు అసోసియేషన్ ప్రస్తుత మరియు పూర్వ కార్యనిర్వాహక సభ్యులు తెలుగు అసోసియేషన్ యూఏఈ ఆవిర్భావం నుండి నేటివరకు నిర్వహించిన సాంస్కతిక , సామాజిక , సేవా కార్యక్రమాలను వివరించారు . అంజయ్య చౌదరి లావు గారు తెలుగు అసోసియేషన్ యూఏఈ ప్రారంభించిన కొద్ది సంవత్సరాల్లోనే మంచి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషించదగిన విషయమని తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలతో యూఏఈలోని తెలుగు వారికి సేవలందించాలి అని తానా తరుపున శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈనాటి ఆత్మీయ సమ్మేళనానికి చొరవ తీసుకున్న ఈ తెలుగు అసోసియేషన్ వారిని అభినందిస్తూ , ఇటువంటి సమ్మేళనాలు మున్ముందు కూడా చేపట్టాలని, తానా మరియు ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు సంఘాల పరస్పర సహకారాలు అందించడం ద్వారా తెలుగు వారికి మరిన్ని కార్యక్రమాలు చేసే అవకాశం ఈ సందర్భంగా తెలియజేసారు.
అంజయ్య చౌదరి లావు గారు తానా మరియు ఇతర తెలుగు సంఘాలు అమెరికాలోని తెలుగు వారికి అందించే సేవా కార్యక్రమాలు యూఏఈ తెలుగు అసోసియేషన్ కి ఎంతో స్ఫూర్తిదాయకం కాగలవని ఈ విచ్చేసిన వక్తలు ఆకాంక్షిస్తూ యూఏఈ తెలుగు అసోసియేషన్ తరుపున శ్రీ అంజయ్య చౌదరి లావు గారిని ఘనంగా సత్కరించారు.
ఈ వారు యూఏఈ తెలుగు అసోసియేషన్ తరుపున ప్రస్తుత కార్య నిర్వాహక చైర్మన్ వివేకానంద్ బలుస , ప్రెసిడెంట్ మసివుద్దీన్, జనరల్ సెక్రటరీ భాస్కర్ , ట్రెజరర్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ డైరెక్టర్ సురేంద్ర ధనేకుల, ఆంధ్రా సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీధర్, కమ్యూనిటీ సర్వీసెస్ భీం శంకర్ వెల్ బంగారి, చైతన్య తెలంగాణ , పూర్వ కార్యనిర్వాహక బృందం నుండి చైర్మన్ దినేష్ కుమార్ ఉగ్గిన ,ట్రెజరర్ మురళి కృష్ణ నూకల , తెలంగాణ వెల్ఫేర్ విభాగ డైరెక్టర్ షేక్ షా వలి విచ్చేసారు. వీరితో పాటు ఫారెస్ట్ నేషన్ ఎండి శరత్ నల్లమోతు ఈ విచ్చేసారు