Thursday, March 12, 2026
Home » భారీ గాలులతో యూఎస్ లో విధ్వంసం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

భారీ గాలులతో యూఎస్ లో విధ్వంసం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 భారీ గాలులతో యూఎస్ లో విధ్వంసం - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • నాలుగు రాష్ట్రాల్లో 22 మంది దుర్మరణం
  • చీకట్లో అయిదు లక్షల మంది

శక్తివంతమైన తుఫానుల శ్రేణి యునైటెడ్ స్టేట్స్ లో: అమెరికా దేశంలోని పలు రాష్ట్రాలను టోర్నడో అల్లకల్లోలం చేసింది. యూఎస్ లోని టెక్సాస్, ఓక్లహామా, కెంటకీ, అర్కాన్సాస్ లను భారీ తుపాను టోర్నడో రూపంలో చుట్టుముట్టింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో తుపాను, భారీ గాలుల కారణంగా మొత్తం 22 మంది చనిపోయారని సమాచారం. అలాగే వందలాది భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆర్కన్సాస్‌లో ఎనిమిది మంది, కెంటకీలో నలుగురు, టెక్సాస్‌లో ఏడుగురు, ఓక్లహామాలో ఇద్దరు మరణించినట్లు అధికారులు గుర్తించారు. తుపాను, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

చీకట్లో అయిదు లక్షల మంది

విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం రాత్రి టెక్సాస్, కాన్సాస్, మిస్సౌరీ, అర్కాన్సాస్, టెన్నెస్సీ, కెంటకీలలో దాదాపు అయిదు లక్షల మందికి పైగా ప్రజలకు విద్యుత్ సౌకర్యానికి దూరమయ్యారు. టోర్నాడో ధాటికి అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. అలాగే, జార్జియా, సౌత్ కరోలినా కొన్ని ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం వరకు తీవ్రమైన తుఫాన్ హెచ్చరికలు ఉన్నాయి నేషనల్ వెదర్ సర్వీస్ గుర్తింపు. ఒహియో, టేనస్సీ లోయలలో సుడిగాలి వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. టోర్నడోల కారణంగా బలమైన గాలులు, భారీ వడగళ్ళు, కుండపోత వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తుఫాను అంచనా కేంద్రం.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch