6
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిన్న ముగిసిన సంగతి తెలిసిందే. అయితే శ్రీకాకుళం పోలింగ్ బూత్ లో టెక్కలి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ తీరు వివాదంగా మారింది.

వివరాల్లోకి వెళ్ళగా …ఓటు హక్కును వినియోగించుకునేందుకు టెక్కలి లోని పోలింగ్ బూత్ కు వచ్చిన ఆయన ఫోన్ మాట్లాడుతూ ఓటు వేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. మరోవైపు అక్కడ ఉన్న సిబ్బంది ఆయనను అడ్డుకోక పోవడం. కానీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఫోన్లు తీసుకురాకూడదు ఎన్నికల అధికారులు గతంలోని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ టెక్కలి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ రూల్స్ బ్రేక్ చేసి ఫోన్ తీసుకువెళ్లారు.