Thursday, March 19, 2026
Home » దేశ ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే నరేంద్ర మోడీ లక్ష్యం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

దేశ ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే నరేంద్ర మోడీ లక్ష్యం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 దేశ ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే నరేంద్ర మోడీ లక్ష్యం - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ప్రపంచ దేశాలకు ఆదర్శంగా భారత్ నిలుస్తుంది
  • తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి
  • జూన్ 4 తరువాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్కులు
  • మీడియా సమావేశంలో అందె బాబయ్య, నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి

ముద్ర/షాద్ నగర్:- దేశ ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే నరేంద్ర మోడీ లక్ష్యం అని బిజెపి రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం షాద్ నగర్ లో బిజెపి నేతలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతోనే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రతి దేశంలో ప్రతి ఇంటికి తీసుకువెళ్లడంతో పాటు యువతలో ఎక్కువ ఉత్సాహం వచ్చిందని అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తో ప్రజల్లో నరేంద్ర మోడీపై మరింత విశ్వాసం పెరిగిందని అన్నారు.

ప్రపంచ దేశాలకు భారత్ ఒక ఆదర్శ దేశంగా నిలిపేందుకు మోడీ ఎంతో కృషి చేయాలని వివరించారు. ఉన్న అన్నదాతలకు పెద్దపీట వేయడంతో పాటు సబ్సిడీపై విత్తనాలు అందించిన ఘనత భారతీయ జనతా పార్టీ దేనిని అన్నారు. భారతదేశంలో ఒక అగ్ర దేశంగా తయారు చేసేందుకు నరేంద్ర మోడీ ఎంతో కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం వేల కోట్ల నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రాష్ట్రం అభివృద్ధి సాధించాలని సంకల్పంతో నిధులను ఎక్కువ మొత్తంలో ఇచ్చారని అన్నారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని. దాంతో ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని, అందుకే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎంతో ఉత్సాహం చూపించారని గుర్తు చేశారు. జూన్ 4 తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. భారతీయ జనతా పార్టీపై తప్పుడు ప్రచారం చేసిన రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్నారు.

తెలంగాణలో ఎక్కువ సీట్లు భారతీయ జనతా పార్టీ దక్కించుకోవడంతో పాటు పాలమూరు పార్లమెంటు సీటు లక్ష మెజార్టీతో డీకే అరుణమ్మ విజయం సాధించడం ఖాయమని భీమా వ్యక్తం చేశారు. బూతు స్థాయి నుండి మండల స్థాయి వరకు ప్రతి బిజెపి కార్యకర్త ఐక్యమత్యంతో సమిష్టి కృషితో, పట్టుదలతో పని చేయడంతోనే విజయం సాధించడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కడ లేదని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టిఆర్ఎస్ అస్తిత్వం పూర్తిగా తగ్గిపోతుందని జ్యోతిష్యం చెప్పారు. నార్త్ లో త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం ఇప్పటికే 14 వేల కోట్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిందని, సౌత్ త్రిబుల్ ఆర్ రోడ్డు పూర్తి చేయడానికి వేల కోట్ల నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.

బిజెపి నేతలు సమిష్టిగా పని చేయడంతోనే పోలింగ్ బూత్‌లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మొత్తంలో ఓట్లు వేశారని, ఎందుకు ప్రతి బిజెపి కార్యకర్తలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వివరించారు. ఇదే స్థాయిలో బిజెపి కార్యకర్తలు పని చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత బలం చేకూరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కక్కునూరు వెంకటేష్ గుప్తా, బిజెపి నేతలు చెంది మహేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కమ్మరి భూపాల చారి, నరసింహ, వంశీ, రిషికేష్ లు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch