Sunday, February 22, 2026
Home » ఆళ్లగడ్డలో హై టెన్షన్‌ వాతావరణం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఆళ్లగడ్డలో హై టెన్షన్‌ వాతావరణం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 ఆళ్లగడ్డలో హై టెన్షన్‌ వాతావరణం - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై హత్యాయత్నం..

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆళ్లగడ్డలో హై టెన్షన్ వాతావరణం. మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ బాడీ గార్డ్‌ నిఖిల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మంగళవారం రాత్రి అఖిల ప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా.. దుండగులు వాహనంతో అతి వేగంగా వచ్చి ఢీకొట్టడమే కాకుండా..తల పై రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టారు.

నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని నంద్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గతంలో లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడిలో నిఖిల్‌ కీలక పాత్ర పోషించాడు. ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులే నిఖిల్‌ ని హతమార్చేందుకు ఈ దాడి చేసినట్లు భూమా వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.



You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch