Friday, February 27, 2026
Home » సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. సొంత నియోజకవర్గంలో బీజేపీ గెలుపు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. సొంత నియోజకవర్గంలో బీజేపీ గెలుపు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. సొంత నియోజకవర్గంలో బీజేపీ గెలుపు - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • మహబూబ్‌నగర్ స్థానంలో బీజేపీ ఘన విజయం
  • హోరాహోరీ పోరులో నాలుగువేల ఓట్ల మెజార్జీతో డికే అరుణ గెలుపు
  • స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో
  • కాంగ్రెస్ కు త‌ప్ప‌ని ఓట‌మి

ముద్ర,తెలంగాణ:- సీఎం సొంత ఇలాఖాలో కాంగ్రెస్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఘన విజయం సాధించారు. 4,500 ఓట్ల మెజార్టీతో డీకే అరుణ విజయ దుందుభి మోగించారు. సర్వ శక్తులు ఒడ్డీనా వంశీ చంద్ రెడ్డి గెలుపు తీరాలకు చేరలేదు.

కొడంగల్, షాద్ నగర్, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు లీడ్ వచ్చింది. కాని మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేటలో బీజేపీ మెజార్టీ ఓట్లు ఉన్నాయి. పంపిణీ బ్యాలెట్ లోనూ బీజేపీ పై చేయి కనబరిచింది. సీఎం రేవంత్ రెడ్డి వరుసగా పదిసార్లు గెలిచిన కాంగ్రెస్ కి విజయం దక్కలేదు. . అభివృద్ధి, సంక్షేమ మంత్రం పని చేయలేదు.

కాగా.. జూన్ 2న విడుదలైన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ ఎస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch