Friday, February 27, 2026
Home » ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి …ఏమన్నారో తెలుసా..? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి …ఏమన్నారో తెలుసా..? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ...ఏమన్నారో తెలుసా..?  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:-ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి అభినందనలు తెలిపారు రేవంత్ రెడ్డి. అంతేకాదు ఇరు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ.. అభివృద్ధి పథంవైపు సాగుదాం అని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సునామీ సృష్టించింది. టీడీపీ, జనసేన, బీజేపీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. టీడీపీ చరిత్రలోనే ఇది అతిపెద్ద విజయం. అసెంబ్లీతో పాటు ఎంపీ స్థానాల్లోనూ కూటమి ప్రభంజనం సృష్టించింది. 8 జిల్లాల్లో అసలు వైసీపీ ఖాతా తెరవలేదు. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం, నెల్లూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. గత ఎన్నికల్లో 151 స్థానాలు సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో 10 స్థానాలకు పడిపోయింది.



You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch