21
మీ సేవా కేంద్రాల్లో అర్జీలు
ఏపీ సేవా, మీ సేవా కేంద్రాల్లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు గ్రామ వార్డు డైరెక్టర్ సచివాలయాల శాఖ, శివప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 400 మందికి పైగా పౌర సేవల్ని ఏపీ సేవా, మీ సేవా పోర్టళ్ల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి దరఖాస్తులు భౌతిక రూపంలో అందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ మేరకు చర్యలు చేపట్టారు. కలెక్టర్లు ఈ మేరకు చర్యలు సూచించారు. భౌతిక రూపంలో వచ్చే దరఖాస్తుల్ని ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు.