Sunday, April 26, 2026
Home » చల్లబడిన భాగ్యనగరం…ఉరుములు, ఈదురుగాలులతో వాన.. పలుచోట్ల వడగండ్లు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

చల్లబడిన భాగ్యనగరం…ఉరుములు, ఈదురుగాలులతో వాన.. పలుచోట్ల వడగండ్లు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 నేటి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా వర్షం కురవడం. పలు ప్రాంతాల్లో సాయంత్రం ఐదు గంటలకే చీకట్లు అలుముకున్నాయి. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, కుమురంబీమ్ అసిఫాబాద్, ములుగు, జనగామ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది.

హైదరాబాద్‌ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వర్షం కనిపిస్తోంది. కూకట్‌పల్లి, నిజాంపేట, కేపీహెచ్‌బీ, లిగంపల్లి, కొండాపూర్‌తో పాటు… జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, రాయదుర్గంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కుమ్మేస్తోంది. మియాపూర్‌లో పలుచోట్ల వడగళ్ల వాన కురిసింది.

ఇక సికింద్రాబాద్‌, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, ప్యారడైజ్‌, మారేడ్‌పల్లి, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, సుచిత్ర, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, పేట్‌బషీరాబాద్‌ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి., రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch