- ఆగం అయిపోయిన రైతుకుటుంబం
- కోర్టు కెక్కిన రైతు తల్లి
ముద్ర.వనపర్తి:-వ్యవసాయ అధికారులు తప్పిదంతో మరణించిన రైతు రైతు బీమా అందని సంఘటన సంఘటన పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో జరిగింది.ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో క్షేత్రస్థాయిలో డాటాలో తప్పులు జరగడంతో ఆ రైతు కుటుంబం ఐదు లక్షల బీమాను కోల్పోయింది.
వివరాల్లోకి వెళ్ళగా గుమ్మడం గ్రామానికి చెందిన పుల్లూరు నరోత్తం రెడ్డి (40) అనే రైతు అనారోగ్య కారణాలతో వైద్య చికిత్స పొందుతూ 29/10/2020 రోజున చనిపోయారు. చనిపోయిన రైతు పుల్లూరు నరోత్తం రెడ్డి కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో పడింది. రైతు నామిని పుల్లూరు వసంతమ్మ (76) అనారోగ్యంతో మంచం పట్టింది. ఆమె మందులు ,ఆలనా, పాలన చూసి వారే కరువయ్యారు.కనీసం రైతుబిమాతోనైనా తన శేష జీవితాన్ని గడుపుదాం అనుకుంటే వ్యవసాయ అధికారుల తప్పిదం వల్ల నేటికి చనిపోయిన రైతు నామిని పుల్లూరు వసంతమ్మకు బీమా రా అనేక ఆర్థిక కష్టనష్టాలకు ఆ కుటుంబం గురైంది.

గతంలో పనిచేసిన ఏ ఈ ఓ డాటా ఎంట్రీలో రైతు పుట్టిన తేదీని 01/07/1960 దరఖాస్తుతో ఇన్సూరెన్స్ వయస్సు పరిధి దాటిపోవడంతో రెగ్యులర్గా ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్ కాలేదు. . కానీ అతని అసలు ఎస్ఎస్సీ సర్టిఫికెట్ ప్రకారం 15/06/1980 వయసు 40 సంవత్సరాలు కూడా దాటలేదు. విషయంపై పలువురి వ్యవసాయ అధికారులను సంప్రదించారు, సరైన విధంగా స్పందించిన బాధిత కుటుంబ సభ్యులు న్యాయపోరాటం గుర్తించారు.
వీరికి జరిగిన అన్యాయంపై యాజమాన్యం ఫోరంలో వేయగా ఆర్యగ్రెస్‌పై కేసు తీర్పు ఉందని మృతుని సోదరి తెలిపారు. కనీసం పాలసీదారులకైనా బాండ్లు పంపిణీ చేస్తే అందులో తప్పులను గుర్తించి సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో ఇలాంటి రైతన్నలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 60 నుండి 70 కేసులు ఉన్నాయని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రైతు బీమా ఆ కుటుంబానికి అందకపోవడం చాలా బాధకరమని, అన్నదాతలు రైతు బాధ అంటున్నారు.
ఈ విషయంలో తప్పు ఎవరిది, బాధ్యత ఎవరు వహిస్తారు అని ,ఇటు వ్యవసాయం, అటు అన్నదాతలు కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నారు.క్షేత్రపరంగా ప్రతి రైతు బీమా ఉన్నటువంటి రైతుకు ప్రతి సంవత్సరం బీమా అందిస్తే తప్పులు తిరగకుండా రైతు స్థాయిలోనే పరిస్థితిని చక్కదిద్దే ఏర్పాట్లు చేయాలని అధికారులు అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.