Friday, March 20, 2026
Home » నకిలీ బంగారంతో 56 లక్షలను తీసుకున్న వైనం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

నకిలీ బంగారంతో 56 లక్షలను తీసుకున్న వైనం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 నకిలీ బంగారంతో 56 లక్షలను తీసుకున్న వైనం - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • నకిలీ బంగారం కేసు విచారణ ఏమైంది…?

ముద్ర గరిడేపల్లి:- గరిడేపల్లి బంగారం రాయినిగూడెం బరోడా బ్యాంకు నందు నేరేడుచర్ల వారి వైకుంటపురం గ్రామానికి చెందిన కేశవారపు రాజేష్ మే నెల 2023 వ సంవత్సరంలో తన బంధువు పేరు మీద దాదాపు కేజీన్నర నకిలీ కుదువపెట్టి 56 లక్షలు రుణం పొందాడు. లోను తీసుకొని సంవత్సరం దాటింది. ఈ నేపథ్యంలో ఇటీవల బ్యాంకు ఉన్నత అధికారులు బ్యాంకులో ఆడిట్ నిర్వహించారు. రాజేష్ కుదువ పెట్టిన బంగారం నకిలీ అని తేల్చారు.

దీంతో బ్యాంకు అధికారులు రాజేష్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే బ్యాంకు సిబ్బంది బంగారం తనిఖీ చేయకుండా ఎలా ఇచ్చారనే కోణంలో బ్యాంకు విచారణ చేపట్టారు. బంగారం తనిఖీ చేసే గోల్డ్ అప్రైజర్ పాత్ర కూడా ఉండొచ్చని విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ బంగారం తాకట్టు విషయంలో మరిన్ని ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా ప్రస్తుతం బయటికి వస్తుండగా అసలు నిజాలు, మోసం ఎలా జరిగింది అనే విషయం పోలీసుల విచారణలో తేలింది.

ఇప్పటికే ఈ విషయంలో విచారణ చేపట్టిన గరిడేపల్లి పోలీసులకు మిరమిట్లు గొలిపే ఆశ్చర్యకరమైన నిజాలు వెల్లడి కావడం వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రాజేష్ పలుమార్లుగా నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టడమే కాకుండా అదే బంగారం పై హాల్ మార్క్, బి ఎస్ ఐ ముద్ర కూడా వేయించడం బ్యాంకు అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. నకిలీ బంగారంతో మోసం చేయడంతో నిందితుడు రాజేష్ బంగారం షా మిర్యాలగూడ ప్రాంతంలో పని చేసినట్లు ఆయన బంధువులు వివరించారు.

మిర్యాలగూడ బంగారం షాపులో పనిచేసి కొన్నాళ్లకు తానే సొంతంగా బంగారం షాపు చేసింది. ఈ నకిలీనే నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా ఎలా నమ్మించాలంటే ఆయన పలు రకాలుగా ప్రయత్నించి నకిలీ బంగారానికి మూడు పొరల మీద హాల్ మార్క్ ముద్రలు వేయించి ఇత్తడికి మూడు పొరల్లో బంగారం పోయించినట్లు తెలిసింది. మూడు పొరలుగా బంగారం పూత ఉండటంతో అసలు బంగారంగా బ్యాంక్ అధికారులను నమ్మించినట్టు సమాచారం. ఈ విషయంలో బంగారాన్ని తనిఖీ చేయాల్సిన గోల్డ్ అప్రైజర్ కూడా కనిపెట్టలేకపోవడం విశేషం. అయితే వాస్తవానికి గోల్డ్ అప్రైజర్ నకిలీదా, ఒరిజినల్ బంగారమా అని కనిపెట్టే విషయంలో కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నిందితుడు రాజేష్ తో కలిసి గోల్డ్ అప్రైజర్, మరికొంతమంది బ్యాంకు సిబ్బందికి కూడా ఈ విషయంలో హస్త ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కేసు నమోదు చేసిన గరిడేపల్లి పోలీసులు ఎన్నికల బిజీ గా ఉన్నందున కొంత కేసు విచారణ నెమ్మదించినప్పటికీ అసలు విచారణ చేదించనున్నట్టు పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా నకిలీ బంగారాన్ని కుదవబెట్టిన రాజేష్ తను ఒక్కడే కాకుండా తనకు తెలిసిన బంధువులు, స్నేహితుల పేరు మీద మొత్తం ఏడుగురు ద్వారా కేజీన్నర బంగారం నకిలీ బంగారాన్ని కుదువబెట్టి మొత్తం 56 లక్షల 85 వేల రూపాయలను రుణంగా పొందినట్టు బ్యాంక్ అధికారులు తీసుకున్నారు. బంధువులు, స్నేహితుల పేరు మీద లోను నిర్ధారణ కాగానే సదర్ ఎమౌంటును తన ఖాతాలోకి మళ్లించుకున్నట్లు తెలిసింది.

దీనికి ప్రధాన కారణంగా బంగారం షాపు సొంతంగా నిర్వహించే నష్టాలకు గురైన రాజేష్ ఎలాగైనా డబ్బులు సంపాదించాలని దురాశతో ఈ ప్రయత్నాలకు పన్నాగం పట్టినట్టు గ్రామస్తులు వివరిస్తున్నారు. వైకుంఠపురం గ్రామంలో బంగారం వస్తువులు చేపిస్తానని డబ్బులు తీసుకున్న రాజేష్ ఆ గ్రామస్తులకు సకాలంలో తాను అనుకున్న ప్రకారం బంగారు వస్తువులు వేయించుకుని డబ్బులు తీసుకుని అతనిపై ఒత్తిడి తీసుకురావడంతో ఇటీవల తన గ్రామాల్లో 30 గుంటల భూమిని ఇచ్చిన వారికి పెద్ద మనుషుల సమక్షంలో రాసి ఇచ్చారని తెలిసింది. మొత్తానికి మొత్తంగా నిందితుడు రాజేష్ తనకున్న ఆర్థిక నష్టాలు, కష్టాల నుండి బయటపడటానికి బ్యాంకును మోసగించి ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలకు, ఆర్థిక మోసాలకు సంబంధించిన సమాచారం. పోలీసులు ఈ విషయంలో విచారణను మరింత లోతుగా నిష్పక్షపాతంగా, వేగవంతంగా జరిపి నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch