Friday, April 24, 2026
Home » MLC Kavitha – కవితకు మరోసారి తీవ్ర నిరాశ… 20వ తేదీ వరకు కస్టడీ పొడిగింపు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

MLC Kavitha – కవితకు మరోసారి తీవ్ర నిరాశ… 20వ తేదీ వరకు కస్టడీ పొడిగింపు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment



ముద్ర,తెలంగాణ బ్యూరో:-ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఆశించిన బీఆర్ఎల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. నేటితో జుడీషియల్ కస్టడీ ముగిసినప్పటికీ మే 20వ తేదీ వరకు పొడగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం కీలక విచారణ జరిగింది. కవితకు 14 రోజుల పాటు మరో జ్యుడీషియల్ కస్టడీ పొడగాలని కోర్టును ఈడీ కోరింది. 8 వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేశామని ఈడీ విడుదల. దీంతో జుడీషియల్ కస్టడీని పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ తీసుకునే అంశంపై మే 20 న విచారణ జరుపుతామని రౌస్ అవెన్యూ కోర్టు ప్రకటించింది.కాగా ఢిల్లీ మద్యం స్కామ్‌లో మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను అధికారులు కోర్టులో హాజరుపరిచారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch