Tuesday, February 24, 2026
Home » తెలంగాణ రాష్ట్రంలో 10 విశ్వవిద్యాలయాలకు కొత్త వీసీలు.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

తెలంగాణ రాష్ట్రంలో 10 విశ్వవిద్యాలయాలకు కొత్త వీసీలు.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 తెలంగాణ రాష్ట్రంలో 10 విశ్వవిద్యాలయాలకు కొత్త వీసీలు.. - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో 10 యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్స్‌లర్ల నియామక ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల కేంద్ర సంఘం పర్మిషన్ ఇచ్చింది. రాష్ట్రంలో పోలింగ్ ముగియడంతో ఈ ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీలను నియమిస్తూ రాష్ట్ర సర్కార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల దరఖాస్తులను ముందుగా ఈ సెర్చ్ కమిటీలు సూచిస్తున్నాయి. ఆ తర్వాత ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురు ప్రొపెసర్ల పేర్లను ఎంపిక చేస్తారు.

అనంతరం వీటి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు పంపుతుంది. గవర్నర్ ఆమోదించిన.. యూనివర్సిటీల్లో వీసీల నియామకాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుంది. అయితే ఈ నెలఖరులో కొత్త వీసీలను ఎంపిక చేసే ప్రక్రియను పూర్తి చేసి.. నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch