ముద్ర,హైదరాబాద్:- తేది.16.05.2024 నాడు జరిగిన పట్టు పరిశ్రమ శాఖ అధికారుల సమావేశం ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ సంచాలకులు శ్రీ. కె. అశోక్ రెడ్డి, ఐ.ఏ.యస్ గారు అధ్యక్షత వహించారు.

1. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 14 000 ఎకరాలు ప్రతిఏడాది 2 000 ఎకరాలు నిర్ధేశముగ చేసుకొని రానున్న 5 సంవత్సరాలలో 25 000 ఎకరాలకు విస్తరింప చేయవలసిందిగా ప్రణాళికలు సిద్ధం చేయాలి.
2. మల్బరీ సాగు వివిధ ప్రాంతాలలో విస్తరించినట్లు కాకుండా క్లాస్టర్ పద్ధతిలో చేయటంవలన ఎక్కువ మంది రైతులు లాభాలు పొందే అవకాశం ఉందని, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సిబ్బందిని పునరుద్దరించుకొని లక్ష్య సాధనకు ఉపక్రమించాలని సూచించారు. రీలింగ్ యూనిట్లు, చాకి సెంటర్లు, ట్విస్టింగ్ యూనిట్లు. అన్నిటిని అనుసందనము చేసుకొని ముందుకు వెళ్లవలసినదిగా దిశ నిర్దేశము చేసారు.
3. మల్బరీ విస్తీర్ణానికి కావాల్సిన నారు మొక్కలు ప్రభుత్వ విత్తన క్షేత్రాల్లో పెంచేందుకు కావాల్సిన ప్రతిపాదనలు అట్టి ఏర్పాట్లు త్వరితగతిన చేయాలని సూచించారు.
4. పరిశ్రమలో అమలవుతున్న వివిధ రాయతీలను రైతులకు విస్తృతంగా తెలియజేయడానికి కావలసిన ప్రచారం చేయవలసినదిగా పట్టు.
5. శాఖ అబివృద్ధికి అవసరమైన రోడు మ్యాపు తయరుచేసి దాని సాధనలో కృషి చేయడమైనది.
6. పట్టు పరిశ్రమలో మార్కెటింగ్ విభాగాన్ని పటిష్టపరచి రైతులకు, రీలర్లకు ప్రోత్సాహకము కలిపించుటకు వారి మద్య సమన్వయానికి తగిన చేర్యాలు తీసుకొని ముందుకు పోవలసినదిగా సూచించబడింది.
7. ఈ డైరెక్టర్ పట్టు పరిశ్రమ శాఖ జైంట్ శ్రీమతి. యం.లత మరియు శ్రీమతి జి.అనసూయ JD గార్లు మరియు వివిధ జిల్లాల ,DD , AD , SO ,ASO క్యాడర్ సిబ్బంది హాజరయ్యారు.