Wednesday, February 25, 2026
Home » తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్రా, తుర్కపల్లి :తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు బిఆర్‌ఎస్ నాయకులు తుర్కపల్లి చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరు నెలలు కష్టపడి పండించిన పంటను రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించి, కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేక నెల రోజులు దాటిన కాంట పెట్టె అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది.

తడిసిన ధాన్యానికి ప్రభుత్వం బాధ్యత వహించి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వడ్లకు ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల బోనస్‌ను చెల్లించాలని అన్నారు.సరైన సమయంలో ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసే రకాల ఎంపిక,ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకు ధాన్యం దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లుచేరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని తెలి పారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి తలారి శ్రీనివాస్, ఎంపీటీసీలు పలుగుల నవీన్ కుమార్, గిద్దె కరుణాకర్ పోగుల ఆంజనేయులు, మేకల బాలకృష్ణ,భాస్కర్ నాయక్, బోయిని సత్తయ్య,గుండా ప్రభాకర్,బాలరాజ్ గౌడ్ , బండారు రవి, ఎర్రల నవీన్ రైతులు కొనసాగుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch