Sunday, March 22, 2026
Home » ఖద్దరు చొక్కా ముసుగులో అధికార ఆధిపత్యం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఖద్దరు చొక్కా ముసుగులో అధికార ఆధిపత్యం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



  • ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు త్రిమూర్తులదే హవా…?
  • ఆసుపత్రిలో ముగ్గురు సెక్యూరిటీ గార్డుల పెత్తనం…?
  • కేవలం ఒకే షిఫ్ట్ విధులకు ముగ్గురు పరిమితం..
  • కింది స్థాయి సిబ్బందికి విధులు నిర్వహించాలని బెదిరింపులు…?

ముద్రణ, గోదావరిఖని: ప్రభుత్వ ఆసుపత్రిలో వారి పేరుకే సెక్యూరిటీ గార్డులు… కానీ పెత్తనం మొత్తం వారి కనుసైగలోనే నడుస్తుంది అనడంలో సందేహం లేదనే చెప్పాలి. ఆసుపత్రిలో ఈ త్రిమూర్తులు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్న తీరుగా కొనసాగుతున్న ముగ్గురు విచారణ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే అనుచరుల పేరుతో బీఆర్ఎస్ నాయకుల పేరుతో చలామణి అయిన సదురు సెక్యూరిటీ గార్డులు ప్రస్తుతం ప్రభుత్వం మారగానే ప్రస్తుత ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే ప్రసన్నం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎవరు అధికారంలో ఉన్న వారి వైపు వెంటనే మళ్లడం వారి వెంట వీరికి వెన్నతో పెట్టిన విద్య అని చుట్టూ గుసగుసలాడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే…

గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో ఈ మధ్యకాలంలో ముగ్గురు సెక్యూరిటీ గార్డుల వివాదం చిలికి చిలికి గాలి వానలా మారుతుంది. అయితే మూడు షిప్టులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి విధులు నిర్వహించాలి. దాదాపు 35 మంది సెక్యూరిటీ గార్డులు ఆసుపత్రిలో పనిచేస్తున్నుండగా ఇందులో ముగ్గురు మినహాయించి మిగిలిన వారందరూ ముగ్గురు విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఈ కద్దర్ చొక్కా నాయకులు మాత్రం కేవలం ఉదయం షిఫ్ట్ కే పరిమితమైన వారికి సంబంధించిన ఇతర రెండు షిఫ్ట్ లను మిగిలినవారు నిర్వహించాలని హుక్కుమ్ జారీ చేయడానికి ఆసుపత్రిలో జోరుగా చర్చ సాగుతుంది. అందరు మూడు షిప్టులు విధులకు నిర్వహిస్తే కేవలం ముగ్గురు మాత్రమే ఒకే షిఫ్ట్ నిర్వహించడం వివాద దారి తీస్తుంది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించి ఖద్దరు చొక్కా ముసుగులో అధికార ఆధిపత్యం చెలాయిస్తున్న ముగ్గురిపై విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch