
- భక్తుల కోసం మంగళసూత్రాలు, లక్ష్మీ కాసులు
- ఆది దేవుడి పాదాల చెంతన ఉంచి విక్రయం
- లాభాపేక్ష లేకుండా నిర్ధారించిన ధరకు విక్రయం
- టీటీడీ వార్షిక బడ్జెట్ రూ. 5122 కోట్లు
- వేద పాఠశాలల అధ్యాపకులకు వేతనాలు పెంపు
- వచ్చే ఏడాది హుండీ ఆదాయం రూ. 1611 కోట్ల అంచనా
- డిపాజిట్లపై వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం రూ. 1167 కోట్లు
- బడ్జెట్‌ను ఆమోదించిన టీటీడీ పాలకవర్గం
ముద్ర, ఏపీ బ్యూరో :తిరుమల తిరుపతి శ్రీవారి భక్తులకు టీటీడీ పాలకవర్గం శుభవార్త చెప్పింది. ప్రత్యేకంగా తయారు చేయించిన మంగళసూత్రాలను శ్రీవారి పాదాల వద్ద ఉంచి విక్రయించారు. వాటితో పాటుగా లక్ష్మీకాసులను కూడా తయారు చేసి విక్రయించారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సోమవారం తిరుమల దేవస్థానం పాలకవర్గం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వార్షిక బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదముద్ర వేసింది. అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాకు వివరాలు. ధర్మప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలను తయారుచేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందిన తరువాత భక్తులకు విక్రయించేందుకు నిర్ణయించారు. 5 గ్రాములు, 10 గ్రాముల్లో ఉంటాయని, వీటిని నాలుగు లేదంటే ఐదు డిజైన్లలో తయారు చేస్తామన్నారు. వీటితోపాటు లక్ష్మీకాసులను కూడా తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. వీటిని లాభాపేక్ష లేకుండా విక్రయిస్తామని, గటంలో 32 వేల మందికి సామూహిక వివాహాలు జరిపించినపుడు మంగళసూత్రాలు అందిస్తే ఏ ఒక్కరూ మతం మారని అందించారు.
మహిళలకు స్వామివారి కానుక
నూతన వివాహం చేసుకోనే వధూవరులకు మంగళాల విక్రయానికి బోర్డు ఆమోదం తెలిపింది. మంగళసూత్రాలు, లక్ష్మీకాసులను ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాస్ట్ టూ కాస్ట్ విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే, ఇంతకుముందు శ్రీవారి బంగారు కానుకల కోసం మహిళల నుంచి డిమాండ్ ఉంది, ఈ నేపథ్యంలోనే మంగళసూత్రాలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. కేవలం నూతన వధూవరులు మాత్రమే కాకుండా మహిళలు ఈ స్వామివారి కానుకను కొనుగోలు చేయవలసి ఉంటుంది, కానీ, కొత్త వివాహం చేసుకునేవారికి ప్రాధాన్యత ఉంటుంది.
రూ. 5 వేల కోట్లు దాటిన వార్షిక బడ్జెట్
తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ రూ.5వేలకోట్లు దాటింది. రూ.5,141.74 కోట్ల అంచనాలతో 2024–-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. రూ.5,122.80 కోట్ల బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదించింది. ఇంజినీరింగ్ ప్రాజెక్టు రూ.350 కోట్లు హిందూ ధర్మప్రచార, అనుబంధాలకు రూ.108.50 కోట్లు కేటాయించారు. వివిధ సంస్థలకు గ్రాంట్స్ రూపంలో రూ.113.50 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం సహకారం రూపంలో రూ.50 కోట్లు, టీటీడీ విద్యాసంస్థలు, పలు వర్సిటీలకు గ్రాంట్లు రూ.173.31 కోట్లు, పారిశుధ్య నివేదన రూ.261.07 కోట్లు, నిఘా భద్రత రూ.149.99 కోట్లు, వైద్య వైద్యం రూ.241.07 కోట్లు కేటాంచారు. స్విమ్స్ అస్పత్రిలో 300 పడకల నుంచి 1200 పడకల పెంపునకు రూ.148 కోట్లతో టెండర్ ప్రకటనకు టీటీడీ ఆమోదం లభించింది. రూ.2.5 కోట్లతో సప్తగిరి సత్రాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఎస్సైతో పాటు పలు కాటేజీల ఆధునీకరణకు రూ.10 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. టీటీడీలో ఒరాకిల్ ఫ్యూషన్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ వినియోగానికి పాలక మండలి ఆమోదం అందిస్తుంది. అన్నమయ్య భవన్ ఆధునీకరణకు రూ.1.47 కోట్లు కేటాయించింది.
ఆదాయం ఇది
ఆదాయం అంచనాలో శ్రీవారి హుండీ కానుకల ద్వారా రూ. 1,611 కోట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రూపంలో రూ.1,167 కోట్లు, ప్రసాదం విక్రయాల ద్వారా రూ.600 కోట్లు, కల్యాణకట్ట రసీదుల ద్వారా రూ.151.50 కోట్లు, గదులు, కల్యాణమండపం బడుగల ద్వారా రూ.147 కోట్లు, శ్రీవారి దర్శనం, ఆర్జిత టికెట్ల విక్రయం రూ.448 ఆదాయం సమకూరుతుందని వార్షిక బడ్జెట్‌లో అంచనా వేశారు. టీటీడీలో పుస్తకాల విక్రయాల ద్వారా రూ.35.25 కోట్లు, అగర్బత్తి, టోల్ గేట్, విద్యా కళాశాల ద్వారా రూ.74.50 కోట్లు ఆదాయం వస్తుందని బోర్డు అంచనా వేస్తోంది.
వేతనాలు పెంపు
టీటీడీ పరిధిలో లడ్డు ట్రేడ్ మోసే కార్మికుల వేతనాలు రూ.15 వేలు అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వేద పాఠశాలల్లో సంభావన అధ్యాపకుల వేతనాలు రూ.34 వేల నుంచి రూ.54 వేలకు పెంచారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 ఆలయాల్లో పని కోసం పాల కొత్త పోస్టుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని టీటీడీక మండలి నిర్ణయించింది. వచ్చేనెల 3, 4, 5వ తేదీల్లో ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నట్లు పాలకమండలి ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సదస్సుకు 57 మంది మరాధిపతులు, పీఠాధిపతులు హాజరవుతారని తెలిపారు. సలహాలు, సూచనలను స్వీకరించి అమలు చేసిన భూమన వివరించారు.
అదే విధంగా టీటీలో విధులు నిర్వర్తిస్తున్న అర్చకుల జీతాలు పెంచుతున్నట్లు పాలకమండలి ఆలయ ప్రదర్శనలు. దీనితో పాటు 56 వేదపరాయణదారుల పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకుంది. వేదపండితుల పింఛన్ రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల కేటాయింపునకు సహకరించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పాలకమండలి తీర్మానం చేసింది.