12

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- వాలంటీర్లపై అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు పెట్టారు. ఐపీసీ సెక్షన్ 499, 500 కింద ఈ కేసు నమోదైంది. వాలంటీర్లు, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా పవన్ మాట్లాడారని కేసులో ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ కేసును తీసుకున్న గుంటూరు జిల్లా కోర్టు 25న విచారణకు రావాలని పవన్ కళ్యాణ్‌ని ఆదేశించింది. ఈ కేసును నాలుగో అడిషనల్ జిల్లా కోర్టుకు బదిలీ చేసింది.తాజాగా కోర్టు విచారణకు పిలవడంతో.. ఏం జరుగుతుందో అనే టెన్షన్ జనసేన కార్యకర్తలు, అభిమానుల్లో ఉంది. టీడీపీతో కలిసి ఎన్నికల ప్రచారానికి జనసేన రెడీ అవుతున్న సమయంలో ఈ కేసు ఆ పార్టీకి సమస్యగా మారేలా ఉంది.