Sunday, March 22, 2026
Home » విశాఖ తీరంలో పాక్ జలాంతర్గామి ఘాజీ శకలాలు.. గుర్తించిన ఇండియన్ నేవీ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

విశాఖ తీరంలో పాక్ జలాంతర్గామి ఘాజీ శకలాలు.. గుర్తించిన ఇండియన్ నేవీ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 విశాఖ తీరంలో పాక్ జలాంతర్గామి ఘాజీ శకలాలు.. గుర్తించిన ఇండియన్ నేవీ - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • 1971 భారత్-పాక్ యుద్ధ సమయంలో విశాఖ తీరం వరకు చొచ్చుకొచ్చిన పాక్ జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ
  • సముద్ర తీరానికి 2.5 అడుగుల దూరంలో 100 మీటర్ల లోతున శకలాలు
  • డీఎస్ఆర్‌వీ సాంకేతిక సాయంతో గుర్తింపు

1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో బంగాళాఖాతంలోకి విశాఖపట్టణం వరకు చొచ్చుకొచ్చి భారత్‌ను దొంగదెబ్బ తీయాలని ప్రయత్నించి చావుదెబ్బలు తిన్న పాక్ జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ శకలాలను భారత నౌకాదళం గుర్తించింది. ఇండియన్ నేవీలోని సబ్‌మెరైన్ రెస్క్యూ విభాగం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి వీటిని గుర్తించింది. భారత అమ్ములపొదిలోకి ఇటీవల వచ్చి చేరిన ‘ది డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ (డీఎస్ఆర్‌వీ) సాయంతో ఈ శకలాలను కనుగొన్నారు. విశాఖపట్టణం తీరానికి దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలోని సముద్ర గర్భంలో 100 మీటర్ల లోతున శకలాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, యుద్ధంలో చనిపోయిన వారిని గౌరవించడం మన నౌకాదళం ఆచారం కావడంతో వాటిని తాకలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

2013లో ఐఎన్ఎస్ సింధ్‌రక్షక్ ప్రమాదానికి గురై 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాల సమయంలో సిబ్బంది రక్షించేందుకు వీలుగా 2018లో తొలిసారి డీఆర్‌వో సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. నౌకలు, జలాంతర్గాములు ప్రమాదానికి గురైనప్పుడు వాటిని గుర్తించి సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ సాంకేతికతను ఉపయోగించాలి. ప్రస్తుతం నేవీ వద్ద రెండు డీఎస్ఆర్‌వీలు ఉన్నాయి. నౌకలు, విమానాల ద్వారా దీనిని తరలించవచ్చు. భారత్ సహా 12 దేశాల వద్ద మాత్రమే ప్రస్తుతానికి ఇలాంటి సాంకేతికత అందుబాటులో ఉంది. డీఆర్ఎస్‌వీ 650 మీటర్ల దిగువకు వెళ్లి పనిచేసే సామర్థ్యం ఉంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch