11

ముద్ర,తెలంగాణ:- పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థుల లెటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాది ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల కానున్నాయి. మే 6న ఈసెట్ పరీక్ష జరిగింది. మొత్తం 99 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 24,272 మంది అభ్యర్థులు ఈసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈసెట్ పరీకను నిర్వహించారు. ఈ https://ecet.tsche.ac.in/ లింక్‌లో ఈసెట్‌లను తెలుసుకోవచ్చు.