5

ముద్ర,తెలంగాణ:-హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ భారీ మోసానికి దారితీసింది. అధిక వడ్డీతో 517 మందికి ఆశ చూపించింది. వాళ్ల నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. చివరికి తాము మోసపోయామని బాధితులు గ్రహించారు. వీరందరూ బషీర్‌బాగ్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వారిని న్యాయ చేయాలంటూ డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.