4

ముద్ర,తెలంగాణ:- వాహనాల వాహనాలకు సంబంధించి ఫ్యాన్సీ నంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ ఫ్యాన్సీ నెంబర్ల కోసం వాహన యజమానులు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెడతారు. అయితే ఈ సారి గత రికార్డులన్నింటిని బద్దలు కొడుతూ ఖైరతాబాద్ ఆర్డీఏ సోమవారం నిర్వహించిన వేలం పాటలో టీజీ 09 9999 ఫ్యాన్సీ నంబర్ ఏకంగా రూ. 25, 50,002 లకు అమ్ముడుపోయింది. సోనీ ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్ దీనిని స్వాధీనం చేసుకుంది. తమ టయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్‌ఎక్స్ కోసం ఈ భారీ ప్రాజెక్ట్ వెచ్చించింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక వాహన ఫ్యాన్సీ నంబర్ ఈ స్థాయి రేటు పలకడం ఇదే తొలిసారి.