Monday, February 23, 2026
Home » ఏపీలో ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ఎస్పీలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఏపీలో ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ఎస్పీలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 ఏపీలో ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ఎస్పీలు - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



అమరావతి, ముద్ర: ఏపీలో ముగ్గురు కలెక్టర్లు, ఐదుగురు ఎస్పీలపై ఎలక్షన్ కమీషన్ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా బదిలీ అయినవారి స్థానంలో కొత్తవారిని నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధుల్లో చేరాలని సాయంత్రం ఆదేశించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ గా డీకే బాలాజీ, అనంతపురం కలెక్టర్ గా వి.వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్ గా ప్రవీణ్ కుమార్ లను నియమించారు. కొత్త ఎస్పీల జాబితాలో చిత్తూరు ఎస్పీగా మణికంఠ, గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాటి, ప్రకాశం ఎస్పీగా సునీల్, పల్నాడు ఎస్పీగా బింధు మాధవ్, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్ధార్, నెల్లూరు ఎస్పీగా ఆరీఫ్‌లను ఈసీ నియమించింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch