- ప్రతి సంవత్సరం జీలుగుతో పచ్చిరొట్ట ఎరువు పొలాల్లో తయారు చేసుకుంటున్న రైతన్నలు
- ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో కొద్దిపాటిగా వచ్చిన జీలుగు విత్తనాలు
- చాలినంత జీలుగు విత్తనం సరఫరా చేయాలనుకుంటున్న రైతులు
- జీలుగు విత్తనాల కోసం తుంగతుర్తి ఎస్సై ఎస్సై వద్ద బారులు తీరిన రైతులు
తుంగతుర్తి ముద్ర:- ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది .రైతన్నలు పలు రకాల విత్తనాల కోసం విత్తన బట్టల వెంట తిరుగుతున్నారు. ముఖ్యంగా వర్షాలు కురియగానే పచ్చిరొట్ట ఎరువుగా జీలుగు విత్తనాలను తమ పొలాల్లో చల్లి జీలుగు పెరిగిన అనంతరం పొలంలో దున్ని ఎరువుగా మార్చుకోవడం రైతులకు పరిపాటిగా మారింది. కానీ ఈ సంవత్సరం జీలుగు విత్తనాలు కొద్ది మోతాదులో మాత్రమే తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎఫ్‌ఎస్‌ఎస్‌కి రావడం జరిగింది.

వందలాది మంది రైతులు జీలుగు విత్తనాల కోసం ఎదురుచూస్తుండగా కేవలం 80 సంచులు మాత్రమే జీలుగు విత్తనాలు రావడం రైతుల నిరాశకు గురిచేస్తుంది. వచ్చిన వాటిని రైతులకు సక్రమంగా అమ్మకం చేస్తారా? అనేది సందేహాస్పదంగా కనిపిస్తుంది. జీలుగు విత్తనాలు ప్రతి రైతు తన పొలంలో పచ్చిరొట్ట ఎరువుగా వాడకానికి తహతహ లాడాడు. అటువంటి జీలుగు విత్తనాలు ఆలస్యంగా రావడమే కాకుండా తక్కువ మోతాదులో రావడం. ఇప్పటికైనా రైతులకు కావలసినన్ని జీలుగు విత్తనాలు సరఫరా చేస్తే ప్రభుత్వాన్ని తుంగతుర్తి మండల రైతాంగం కోరుతుంది.