Saturday, March 14, 2026
Home » విద్యావంతుల తరపున ప్రశ్నించే తీన్మార్ మల్లన్నను గెలిపించాలి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

విద్యావంతుల తరపున ప్రశ్నించే తీన్మార్ మల్లన్నను గెలిపించాలి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 విద్యావంతుల తరపున ప్రశ్నించే తీన్మార్ మల్లన్నను గెలిపించాలి - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కే అన్ని పార్టీల మద్దతు
  • సూర్యాపేటలో వాకర్స్ ను పట్టభద్రులను ఓటు అభ్యర్థించిన రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట ముద్ర ప్రతినిధి:- ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించే తీన్మార్ మల్లన్నను ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విద్యావంతులు, మేధావులు, మేధావులు మెదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వేకువ జామున సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్, ఎస్వీ డిగ్రీ కళాశాల మైదానం, పబ్లిక్ క్లబ్‌లో వాకర్స్, క్రీడాకారులను ఓటు అభ్యర్థించి మాట్లాడారు. తీన్మార్ మల్లన్న తన క్యూ న్యూస్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సమస్యలను పరిష్కరించారు.

ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించారు. గతంలో ఏ పార్టీ మద్దతు లేకుండా పోటీ చేస్తే లక్ష ఇరవై వేల ఓట్లకు పైగా గెలుచుకొని కొద్ది ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లన్నకు అన్ని పార్టీల మద్దతు. నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన పోరాడి ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న అవుతాడని అందులో ఎలాంటి సందేహం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వెలుగు వెంకన్న, షఫీ ఉల్లా, డాక్టర్ ఊర రామ్మూర్తి, నాయకులు నేరెళ్ల మధు, వల్దాస్ దేవేందర్, నిమ్మల వెంకన్న, గాయం కరుణాకర్ రెడ్డి, తండు శ్రీనువాసు, స్వామి నాయుడు, ఈర్ల వాసు, యాట వెంకన్న, పోల గాని కృష్ణ, ఉపేందర్ ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch