Sunday, March 15, 2026
Home » ఘోర రోడ్డు ప్రమాదం…స్పాట్‌లోనే ముగ్గురు మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఘోర రోడ్డు ప్రమాదం…స్పాట్‌లోనే ముగ్గురు మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ఘోర రోడ్డు ప్రమాదం...స్పాట్‌లోనే ముగ్గురు మృతి - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:-రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం అయ్యసాగర్‌ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో చనిపోయిన వారు కల్వకుర్తి నుంచి హైదరాబాద్ కు కారులో వస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు ఆర్టీసీ బస్సు వెళ్తుంది.కారు, బస్సు ఎదురుగా వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. కారులోని వారు మృతి చెందారు. అందులోనే ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతి చెందినవారంతా హైదరాబాద్ కు చెందిన వారని పోలీసులు గుర్తించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch