Saturday, March 14, 2026
Home » ఇక నుంచి యాద్రాద్రి టికెట్ల బుకింగ్ ఆన్‌లైన్‌లో…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఇక నుంచి యాద్రాద్రి టికెట్ల బుకింగ్ ఆన్‌లైన్‌లో…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ఇక నుంచి యాద్రాద్రి టికెట్ల బుకింగ్ ఆన్‌లైన్‌లో...!  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధానంలో ఇక ఆన్‌లైన్‌ బుకింగ్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక నుంచి భక్తులు దేవస్థాన వెబ్ పోర్టల్ ద్వారా మే 23 నుంచి ఆన్ లైన్ బుకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు.ఇక భక్తులు ఎవరైనా yadadritemple.telangana.gov.in website లో ఓ గంట ముందు దర్శనానికి లేదా పూజ కార్యక్రమాలకు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఈవో గా భాస్కరరావు చార్జ్ తీసుకున్న తర్వాత భారీ మార్పులు వస్తున్నాయి. సామాన్య భక్తులకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఇతర క్రితమే యాదగిరిగుట్ట దేవస్థానంలో జరిగే ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ దుస్తులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు.బ్రేక్ దర్శనాలు, నిత్యకల్యాణం, జోడు సేవలు, అభిషేకాలు, వ్రతాల్లో దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని కోరారు. మగవారు పంచె, పట్టువస్త్రాలు, తెల్లటి దుస్తులు, మహిళలు చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌ కానీ, చీరగానీ, లంగా వోణి గానీ ధరించాలని చెప్పారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch