Tuesday, February 24, 2026
Home » ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల …. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల …. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల .... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు శుక్రవారం (ఏప్రిల్ 12) విడుదలయ్యాయి. తాడేపల్లి ఇంటర్మీడియ గంటలకు ఇంటర్మీడియట్ బోర్డులో ఉదయం 11 గంటలకు బోర్డు కార్యదర్శి, పరీక్షల కన్వీనర్ విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. సాధారణ విద్యార్థులతోపాటు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు సంబంధించిన ఫలితాలు కూడా ఉన్నాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఇతర వెబ్‌సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. పరీక్షలు నిర్వహిస్తున్న 22 రోజుల్లోనే రికార్డుస్ధాయిలో ఇంటర్ బోర్డు ఫలితాలు ప్రకటించడం విశేషం.

ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం, సెకండియర్‌లో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా 84 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, 81 శాతంతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో, 79 శాతంతో ఎన్టీఆర్ జిల్లా మూడోస్థానంలో నిలిచాయి. ఫలితాలతో పాటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను, ఫీజు వివరాలను అధికారులు కలిగి ఉన్నారు.

ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్లు..

https://resultsbie.ap.gov.in/

https://bieap.apcfss.in/

https://www.manabadi.co.in/

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch