Saturday, March 14, 2026
Home » ఆస్ట్రేలియాలో షాద్‌న‌గ‌ర్ వాసి అనుమానాస్ప‌ద మృతి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఆస్ట్రేలియాలో షాద్‌న‌గ‌ర్ వాసి అనుమానాస్ప‌ద మృతి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ఆస్ట్రేలియాలో షాద్‌న‌గ‌ర్ వాసి అనుమానాస్ప‌ద మృతి - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన అరటి అరవింద్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయిదు రోజుల క్రితం అదృశ్యమైన అరవింద్.. సముద్రంలో శవమై తేలడం కలకలం రేపింది. సిడ్నీలోని సముద్ర తీరానికి కొద్ది దూరంలో పోలీసులు అరవింద్ కారును గుర్తించారు. లభించిన ఆధారాలతో మృతి చెందిన వ్యక్తిని అరవింద్‌గా పేర్కొన్నారు.

ఉద్యోగం కోసం 12 ఏళ్ల క్రితం అరవింద్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో స్థిరపడ్డాడు. అయితే అరవింద్‌ది హత్య లేదా ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 18 నెలల క్రితమే అతనికి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఇటీవలే అరవింద్.. భార్య, తల్లితో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లాడు. 6 క్రితం అతని తల్లికి అక్కడి వాతావరణం పడడంతో ఇండియాకు తిరిగి వచ్చింది. దీంతో అక్కడే అరవింద్, భార్య సిరివెన్నెల కలిసి ఉంటున్నారు.

మరోవిషయం ఏంటంటే అరవింద్ భార్య ప్రస్తుతం గర్భవతి కావడంతో.. ఇండియాకు తిరిగి వస్తామని అతడు భావించాడు. ఇటీవలే తన కుటుంబ సభ్యులకు కారు వాష్ చేయించడం కోసం వెళ్తున్నానని చెప్పి బయటికి వెళ్లాడు. అప్పడి నుంచి అతని ఆచూకి కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా అరవింద్ అనుమానస్పద స్థితిలో మృతి చెందడంతో సిడ్నీ లోకల్ పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch