
- బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి భువనగిరి : బిఆర్ ఎస్ పార్టీ బలపరచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టాభ ద్రులను బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి వివరించారు. శుక్రవారం సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యావంతుడు బిట్స్ పీలాని గోల్డ్ మెడల్ సాధించిన యువకుడు ప్రశ్నించిన గొంతుక రాకేష్ రెడ్డి అని కొనియాడారు. చదువుకున్న వ్యక్తి చట్ట సభల్లోకి వస్తే విద్యార్థుల, విద్యావంతుల, ప్రభుత్వ ప్రయివేట్, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాడని అన్నారు. అదే విధంగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న కళాశాలల ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయలేదని అన్నారు.
ప్రభుత్వం తో కొట్లాడి నిరుద్యోగులకు, ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయిస్తానని అన్నారు. నిరుద్యోగ భృతి వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. రాకే ష్ రెడ్డి ని గెలిపిస్తే తనకు నెల వారి వచ్చే జీతం మొత్తం విద్యార్థుల కోసం ఖర్చు పెడతాడని కోచింగ్ సెంటర్లలో నిరుద్యోగుల కొరకు,ఉచిత విద్యను అమలు చేస్తానని అన్నారు. పట్టభద్రులు, ఆలోచించి ఈనెల 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3వ సీరియల్ నెంబర్ పై 1వ ప్రాధాన్యత ఓట్లు వేసి భారీ మెజారిటీ తో రాకేష్ రెడ్డి గెలిపించాలని నిర్ణయించారు.