5

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ముఖ్యమంత్రి జగన్ పై దాడిని ఎన్నికల సంఘం సీరియస్ తీసుకుంది. ఎన్నికల సమయంలో సీఎం పైనే దాడి జరగడం తీవ్రంగా మారింది. ఈ ఘటన పైన ప్రాథమిక సమాచారం సేకరించింది. పూర్తి నివేదిక అందించిన పోలీసు అధికారులను ఆదేశించారు. దాడికి కారకులను తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేంద్రం సైతం ముఖ్యమంత్రి పై దాడి అంశం పైన ఆరా తీసినట్లు సమాచారం. రాజకీయ ప్రమేయంతో పాటు భద్రతా వైఫల్యం ఉందా అనే కోణంలోనూ చర్చ సాగుతోంది.