
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిపై వైసీపీ విమర్శలు చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైయస్‌ఆర్ జిల్లా సున్నపురాళ్లపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అవినాష్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. అందుకే కడప నుంచి అతడిని మార్చాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలా మారిస్తే వివేకాను చంపింది అవినాషే అని జగన్ నమ్మినట్టే కదా అని అన్నారు.
వివేకాను చంపించింది అవినాష్‌రెడ్డి అని సీబీఐ ఆధారాలతో చెబుతుంటే.. జగన్ తన అధికారాన్ని అడ్డుపెట్టి హంతకులను కాపాడాడు. ప్రజలు జగన్‌కు అధికారం ఇచ్చింది నిందితులను కాపాడేందుకేనా? అని ప్రశ్నించారు. మీ ఆడ బిడ్డలం అడుగుతున్నాం.. న్యాయం చేయండి అంటూ ప్రజల కోసం. వైఎస్ఆర్ బిడ్డ కావాలో.. వివేకా హత్య నిందితుడు అవినాష్ రెడ్డి కావాలో.. ప్రజలు తేల్చుకోవాలని అన్నారు.
- ఆధారాలు ఉన్నాయి…
వివేకా హత్య విషయంలో మేం ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదని షర్మిల అన్నారు. హత్య కేసులో ఆధారాలున్నందునే గట్టిగా చెబుతున్నాం. మళ్లీ అన్యాయం జరగకూడదనే అక్కాచెల్లెళ్లు పోరాడుతున్నాం అని అన్నారు. హత్యా రాజకీయాలు ఆగాలనేదే తమ పోరాటం అని అన్నారు.
అవినాష్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. అందుకే కడప నుంచి అతడిని మార్చాలని వైసీపీ చూస్తుంది. అలా మారిస్తే వివేకాను చంపింది అవినాషే అని జగన్ నమ్మినట్టే కదా. వివేకాను చంపించింది అవినాష్‌రెడ్డి అని సీబీఐ ఆధారాలతో చెబుతుంటే.. జగన్ తన అధికారాన్ని అడ్డుపెట్టి హంతకులను కాపాడుతున్నారు. ప్రజలు… pic.twitter.com/f9BsoziFi5
– వైఎస్ షర్మిల (@realyssharmila) ఏప్రిల్ 13, 2024