4

ముద్ర,తెలంగాణ:- నాగోల్‌లో ఉదయం తాగి రోడ్డుమీద హంగామా చేసిన జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నడిరోడ్డు పై తాగుతూ వాకర్స్ ను ఇబ్బంది పెట్టిన అలెక్స్ తో పాటు యువతి అరెస్ట్ చేశారు. తాగుతూ రోడ్డుపై హంగామా చేస్తున్న జంటను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాగి గొడవ చేస్తున్న వాళ్లనివాకర్స్ మందలించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం దక్కలేదు.
వాకర్స్ మీద తిరుగుబడిన జంట హంగామా సృష్టించి బీభత్సం సృష్టించారు. జంట హల్చల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అలెక్స్ తో పాటు యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలోనూ అలెక్స్, యువతి ఇదే తరహాలో హంగామా పేర్కొన్నారు. అలెక్స్ తో పాటు యువతిని కూడా నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు.