Friday, March 20, 2026
Home » విజయవాడ అగ్ని ప్రమాదం -మెడికల్‌ గోడౌన్‌లో మంటలు.. రూ. 5 కోట్ల పైనే నష్టం! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

విజయవాడ అగ్ని ప్రమాదం -మెడికల్‌ గోడౌన్‌లో మంటలు.. రూ. 5 కోట్ల పైనే నష్టం! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 విజయవాడ అగ్ని ప్రమాదం -మెడికల్‌ గోడౌన్‌లో మంటలు.. రూ.  5 కోట్ల పైనే నష్టం!  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్ర,విజయవాడ:- విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బందర్ రోడ్‌లోని ఓ మెడికల్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని భారీగా పొగ వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కానీ అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి గోడౌన్ లోపల పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.

మెడికల్ గోదాం నుంచి ఎగిసిపడుతున్న మంటలు ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 5 అగ్నిమాపక వాహనాల ద్వారా మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగే సమయంలో గోడౌన్‌లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా రూ. 5 కోట్ల పైనే నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch