
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- రేపు మధ్యాహ్నం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. చంద్రబాబు తరుపున ఆయన సతీమణి భువనేశ్వరి నామనేషన్ పత్రాలను అధికారులకు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పం కూటమి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ కార్యక్రమం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలిసారిగా చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
చంద్రబాబుకు రెండు సెట్లు నామినేషన్ దాఖలు భువనేశ్వరి చేయనున్నారు. రేపు ఉదయం కుప్పం వరదరాజులస్వామి ఆలయంలో భువనేశ్వరి పూజలు నిర్వహించనున్నారు. నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం కుప్పంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎల్లుండి కుప్పం ప్రజల సమక్షంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు. జరగున్నాయి. ఈరోజు హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా భువనేశ్వరి కుప్పం వెళ్లనున్నారు.