Thursday, March 19, 2026
Home » కొనసాగుతున్న గ్రాడ్యుయేట్స్ పోలింగ్.. 12 గంటల వరకు 33.19 శాతం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

కొనసాగుతున్న గ్రాడ్యుయేట్స్ పోలింగ్.. 12 గంటల వరకు 33.19 శాతం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 కొనసాగుతున్న గ్రాడ్యుయేట్స్ పోలింగ్.. 12 గంటల వరకు 33.19 శాతం - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:-వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలీసుల పనితీరు కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభద్రులంతా కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 12 గంటల వరకు 33.19 శాతం పోలింగ్ నమోదైంది. కాగా.. 12 జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వ్యవహరిస్తున్నారు. జూన్ 5న కౌంటింగ్ నిర్వహించనున్నారు.ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో BRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch