Thursday, March 12, 2026
Home » రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలషెడ్యూల్ విడుదల… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలషెడ్యూల్ విడుదల… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలషెడ్యూల్ విడుదల... - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,హైదరాబాద్:-రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లపై సమీక్ష జరిగింది.జూన్‌ 2న ఉదయం గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పిస్తారని, ఆ తర్వాత సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు.

”జూన్‌ 2న ట్యాంక్‌బండ్‌పై స్వయం సహాయక బృందాలకు చెందిన హస్తకళలు, చేనేత కళల స్టాళ్లు ఏర్పాట్లు చేస్తాం. ప్రముఖ హోటళ్ల ఫుడ్‌ స్టాళ్లు, పిల్లలకు క్రీడలతో కూడిన వినోదశాలలూ ఏర్పాటు అవుతాయి.రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కళారూపాల కార్నివాల్‌ జరుగుతుంది. అందులో బాణసంచా, లేజర్ షో ఉంటాయి. 5 వేల మంది శిక్షణ పోలీసులు బ్యాండ్ ప్రదర్శన చేస్తారు”అని ఎస్‌ఎస్‌ తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch