Wednesday, April 29, 2026
Home » Harish Kumar Gupta – ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

Harish Kumar Gupta – ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 Harish Kumar Gupta - ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేసింది. సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సమాచారం అందించింది. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. కాగా, వరుస ఫిర్యాదులతో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.

కొత్త డీజీపీ కోసం ముగ్గురి పేర్లు పంపించాలని ఆదివారం ఎన్నికల సంఘం సీఎస్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముగ్గురి పేర్లతో కూడిన ప్యానల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపించింది. సీనియర్టీ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్త పేర్లను కొత్త పోలీస్ బాస్ పోస్ట్ కోసం సిఫార్సు చేసింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch