5

ముద్ర,తెలంగాణ:-ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. మృతుడు శ్రీనివాస్ ఇందల్వాయి మండల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.సాయినగర్‌లో నివాసం ఉంటున్న ఇందల్వాయి మండల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నూతనంగా భవనం ఒకటవ అంతస్తులో పైపుతో నీరు కొడుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపడిపోవడంతో తీవ్ర గాయాలు పాలై మృతి చెందాయి. దీంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.