Saturday, March 14, 2026
Home » హెచ్‌సీయూకి అంతర్జాతీయ గుర్తింపు… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

హెచ్‌సీయూకి అంతర్జాతీయ గుర్తింపు… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 హెచ్‌సీయూకి అంతర్జాతీయ గుర్తింపు... - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,హైదరాబాద్:-హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం అంతర్జాతీయంగా అత్యుత్తమ విద్యాసంస్థగా చోటు దక్కించుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ కోర్సులు అభ్యసించే విద్యార్థుల కోసం నిర్దిష్టమైన ప్రమాణాలు పాటిస్తున్న విద్యా సంస్థలను స్టడీ అబ్రాడ్ ఎయిడ్ సంస్థ ఈ ఏడాది ఎంపిక చేసింది. ఈ జాబితాలో హెచ్సీయూకు చోటు దక్కింది.

మొత్తం 20 ఆసియా దేశాల్లోని 3,349 విద్యా సంస్థల్లోని విద్యా ప్రమాణాలను ఈ సంస్థ తీసుకుంది. వాటిపై అధ్యయనం చేసి, క్షుణ్ణంగా పరిశీలించి.. ఇందులో 12 శాతం ఉత్తమ విద్యాసంస్థలను ఎంపిక చేసింది. ఈ జాబితాలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో స్థానం సంపాదించినందుకు సంతోషంగా ఉందని హెచ్‌సీయూ వీసీ ప్రొ.బీజేరావు తెలిపారు. అంతర్జాతీయ విద్యార్థులకు తమ వర్సిటీ మొదటి ఎంపికగా ఉండేలా కృషి చేయాలని అన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch