Thursday, July 23, 2026
Home » ముగిసిన ముఖ్యమంత్రుల సమావేశం… సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయం! (గ్యాలరీ) – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ముగిసిన ముఖ్యమంత్రుల సమావేశం… సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయం! (గ్యాలరీ) – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ముగిసిన ముఖ్యమంత్రుల సమావేశం... సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయం!  (గ్యాలరీ) - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలు వేయాలని నిర్ణయం
  • అధికారులతో ఓ కమిటీ, మంత్రులతో మరో కమిటీ వేయాలని నిర్ణయం
  • 1.45 గంటల పాటు సాగిన ముఖ్యమంత్రుల సమావేశం

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మంత్రులు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు ఉన్నారు. సాయంత్రం 6.10 గంటలకు ప్రారంభమైన సమావేశం 7.45 నిమిషాలకు ముగిసింది. సమావేశం 1.45 నిమిషాల పాటు సాగింది.

ముఖ్యమంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులతో ఒక కమిటీని, అధికారులతో మరో కమిటీని వేయాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వకంగా చర్చ సాగింది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని నిర్ణయించారు.

ప్రధానంగా చర్చించిన అంశాలివే..

  • రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లో అనేక సంస్థల ఆస్తుల పంపకాలు
  • విభజన చట్టంలో సంస్థల ఆస్తుల పంపకాలు
  • ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు
  • పెండింగ్ విద్యుత్తు బిల్లులు
  • విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు. వాటి అప్పుల పంపకాలు
  • ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చులకు చెల్లింపులు
  • హైదరాబాద్‌లో ఉన్న మూడు భవనాలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే అంశం
  • లేబర్ సెస్ పంపకాలు
  • ఉద్యోగుల విభజన అంశాలు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch