Tuesday, February 24, 2026
Home » మళ్లీ అధికారం మాదే… సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

మళ్లీ అధికారం మాదే… సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 మళ్లీ అధికారం మాదే... సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఈరోజు విజయవాడలోని బెంజ్ సర్కిల్‌లో సీఎం జగన్ ఐ ప్యాక్ ప్రతినిధులతో భేటీ అయ్యారు.సుమారు అరగంటపాటు అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పొలిటికల్ కన్సల్టెన్సీగా ఐప్యాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ఫలితాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ఊహించలేని స్థాయిలో సీట్లు వస్తాయని అన్నారు. 151 కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు వస్తాయని.. 22 కన్నా ఎక్కువ ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న ఏపీ ఫలితాలు చూసి దేశం షాకవుతుందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రజలకు ఎక్కువగా మేలు చేద్దామని.. ప్రయాణం ఇలానే కొనసాగిద్దామంటూ పేర్కొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch