5

ముద్ర, ఇటీవల: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్రం భద్రతను పెంచింది. గత రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భద్రతా అధికారులు తెలుగుదేశం కార్యాలయం, కరకట్ట వద్ద చంద్ర బాబు నాయుడు నివాసం, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి కరకట్ట మార్గాన్ని పరిశీలించారు. ఆ తర్వాత అదనంగా 12×12 రెండు బ్యాచ్‌లుగా 24 మంది ఎస్‌పి జి బ్లాక్ క్యాట్ కమెండోలను కేటాయించారు. ఒక పక్క యూపీ సి.ఎం యోగీ ఆదిత్యనాధ్, కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్ లకు రక్షణ తగ్గించడం, చంద్రబాబుకు రక్షణ పెంచడం ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది.