6

ముద్ర, తెలంగాణ వార్తలు: మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక 2024 : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసనమండలి ఉప ఎన్నికలో భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఈ విజయంతో అక్కడి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత తొలి రౌండ్ నుంచి కూడా బీఆర్ఎస్ అధికారం కొనసాగుతోంది. లెక్కింపు సరళిని గమనించిన కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి మధ్యలోనే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ విజయానికి కృషి చేసిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.