Thursday, March 12, 2026
Home » ఘనంగా తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఘనంగా తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ఘనంగా తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్ర ప్రతినిధి, నిర్మల్:ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పదో వార్షిక ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయ సముదాయాన్ని అందంగా అలంకరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్బంగా కలెక్టర్ క్యాంప్ కోసం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్అహ్మద్, కిషోర్ కుమార్ ఉన్నారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల భవనము ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఆర్డీవో రత్న కల్యాణి, డిఇఓ డాక్టర్ రవీందర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అమర వీరుల స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సాధనలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch