4

ముద్ర,తెలంగాణ:-ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిమాండ్ ముగియడంతో నేడు తీహార్ జైలు అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మధ్యాహ్నం అధికారులు ప్రవేశపెడతారు. కాగా కోర్టులోకి వస్తున్న సందర్భంలో ఎమ్మెల్సీ కవిత ‘జై తెలంగాణా, జై భారత్’ అంటూ నినాదాలు చేశారు.